హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొర్రెల మేత వివాదం.. ఇద్దరిపై కేసు!

BPT: అద్దంకి(M) రామాయపాలెంలో శుక్రవారం గొర్రెలను మేపే పొలాల విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గ్రామానికి చెందిన రావులపల్లి అనిల్ కుమార్, రావులపల్లి రామకృష్ణ పరస్పరం కర్రలతో దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనపై ఇరువురూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.