హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలవరం మీదుగా ఆరు లేన్ల జాతీయ రహదారి

GNTR: ఖరగ్‌పూర్-అమరావతి మధ్య నిర్మించనున్న ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే డిజైన్‌లో మార్పులు చేయాలని ఏపీ సర్కారు కేంద్రాన్ని కోరింది. పట్టిసీమ బదులుగా పోలవరం మీదుగా ఈ రహదారిని మళ్లించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే పోలవరం వద్ద గోదావరి నదిపై ఒక ఐకానిక్ వంతెనను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన తాజా ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది.