హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుల వేదిక కన్వీనర్‌గా సంతోష్

MLG: తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్‌గా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన రేండ్ల సంతోష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కె. భాస్కర్, జె. లక్ష్మణరావు, వి. మధుసూదన్ రాజు, వి. రమేశ్ తదితరులు పాల్గొన్నారు.