హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ కౌన్సిల్‌లో 34 ఎజెండా అంశాలు

JN: జనగామ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 34 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టగా, 19 అంశాలకు ఆమోదం తెలిపి, మరో 15 అంశాలను వాయిదా వేశారు. శుక్రవారం ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.