హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరగోపాల్‌పై చర్యలు తీసుకోవాలి: రావు పద్మారెడ్డి

HNK: కేయూలో హిందూ మహిళలు, ధర్మంపై ప్రొఫెసర్ హరగోపాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని BJP మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారదకు బీజేపీ, హిందూ సంఘాల నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు పాల్గొన్నారు.