హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనదుర్గమ్మ ఆలయంలో అమావాస్య ప్రత్యేక పూజలు!

MDK:​ పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో శనివారం భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.