GDWL: అలంపూర్‌లోని సుప్రసిద్ధ సంగమేశ్వర ఆలయ గోపురం శనివారం ఉదయం సూర్యకిరణాల వెలుగులో బంగారు వర్ణంతో మెరిసి చూపరులను ఆకట్టుకుంది. ఉదయాన్నే భాస్కరుడి నులివెచ్చని కిరణాలు ఆలయ గోపురంపై పడటంతో ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్యకాంతిలో గోపురం బంగారు రంగులో ప్రకాశించడం చూపరులకు కనువిందు చేసింది. ఈ అద్భుత దృశ్యాలను చూసిన స్థానికులు మంత్రముగ్ధులయ్యారు.
తెలంగాణ
VIDEO: ఉషోదయం.. ఆలయ గోపురం స్వర్ణమయం


