హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రసవం

ASR: కొయ్యూరు మండలం పోకలపాలెంకు చెందిన గర్భిణి పాంగి శాంతికి నిన్న రాత్రి పురిటి నొప్పులు రావడంతో ఆశా వర్కర్ 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది శాంతిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో EMT కొండలరావు, PILOT వినోద్‌కుమార్‌లు గర్భిణికి ప్రసవం చేశారు. అనంతరం తల్లిబిడ్డలను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించారు.