హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ

JN: జిల్లాలోని 30 మంది నిరుద్యోగ క్రైస్తవ మహిళలకు గీతాచార్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి మురళీధర్ రావు తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు అర్హులన్నారు. ఈనెల 17లోగా కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ఎఫ్‌-25 గదిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.