హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పిరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేకు సహకరించాలి'

PDPL: పిరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS-2026) కు ప్రజలు సహకరించాలని స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిన్న రామగుండం పట్టణంలో జాతీయ గణాంక కార్యాలయం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. సర్వేలో ఎంపిక చేసిన కుటుంబాలను 3 నెలలు ప్రతినెల సందర్శించి, మొబైల్ ట్యాబు ద్వారా వివరాలు సేకరిస్తామని తెలిపారు. సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని పేర్కొన్నారు.