హైదరాబాద్: 28°C
తెలంగాణ

11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

HNK: హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 22 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ వేద పండితుడు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నీలారపు రాజ్‌కుమార్, కనుకుంట్ల రవికుమార్, రమేష్, వెంకటరమణాచారి పాల్గొన్నారు.