హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్ వలస దేశం కాదు, ప్రజాస్వామ్య దేశం’

భారత్ ఓ వలస దేశం కాదని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని కమల్ హాసన్ ఉద్ఘాటించారు. దేశ భవిష్యత్తును భారత ప్రజలే నిర్ణయిస్తారని, పాశ్చాత్య శక్తులు కాదంటూ ఎలాన్ మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు. 'భారత్‌నెట్ ఫెయిల్యూర్స్ వంటి మా లోపాలను అంతర్గతంగా చర్చించుకుంటాం, ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ డేటాను అందిస్తున్న మా టెలికాం రంగాన్ని చూసి గర్విస్తున్నాం' అని ట్వీట్ చేశారు.