హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా బతుకమ్మ వేడుకలు

మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ మెరాజుల్లా ఖాన్ వేడుకలను ప్రారంభించారు. సూపరింటెండెంట్ శ్రీనివాస చారి, PSTE హెడ్ రామకృష్ణ పాల్గొని పండుగ విశిష్టతను తెలిపారు. ఫ్యాకల్టీ డాక్టర్ ఎన్.జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ భీమమ్మలతో కలిసి విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మల చుట్టూ ఆడుతూ సందడి చేశారు.