హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ చెక్కు అందజేత

NRML: నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేట్‌కు చెందిన కత్తి శివాజీ కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును అందజేశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి వైద్య ఖర్చుల కోసం ఈ ఆర్థిక సాయం మంజూరైంది. ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.