హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దె విషయంలో హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

NTR: విజయవాడలో హత్య కేసులో నిందితుడు కందవల్లి నాగ శేషుకు జీవిత ఖైదు, రూ.2,000 జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. 2021 డిసెంబర్ 25న ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలో ఆటో అద్దె డబ్బుల విషయంలో జరిగిన గొడవలో జిలానిపై నాగ శేషు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జిలాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.