హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంగిలిపూల బతుకమ్మ.. దద్దరిల్లనున్న భాగ్యనగరం!

HYD: ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలతో భాగ్యనగరం దద్దరిల్లనుంది. తంగెడు, గునుగు పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. ఆట పాటలతో సాగనంపుతారు. ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యంత వైభవంగా, భారీ ఎత్తున మహిళలు గుమిగూడి ఆడుతారు. పోటీ పడుతూ బతుకమ్మ పేరుస్తుంటారు. నగరంలో మాత్రం పువ్వులకు భారీ డిమాండ్ పెరిగింది.