హైదరాబాద్: 28°C
వార్తలు

'ఓట్ చోరీ లేదు-ఉన్నదంతా ఓట్ దూరీ మాత్రమే'

భారత్‌లో 'ఓట్ చోరీ' లేదని, కేవలం 'ఓట్ దూరీ' మాత్రమే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రతికూల రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలపై దాడులు మానుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం ఆపాలన్నారు. విదేశాల్లో దేశ వ్యతిరేక భావాలు ప్రచారం చేస్తే ప్రజల నుంచి మద్దతు లభించదని ఆయన వ్యాఖ్యానించారు.