హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమేశ్వరాలయం హుండీ ఆదాయ వివరాలు

JN: పాలకుర్తిలోని సోమేశ్వరాలయంలో శుక్రవారం హుండీ కానుకలను లెక్కించగా రూ.21,98,507 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న తెలిపారు. మార్చి 24 నుంచి అక్టోబర్ 9 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించిందన్నారు. అలాగే 1 కిలో 359 గ్రాముల మిశ్రమ వెండి, అమెరికా డాలర్లు 230, ఇంగ్లాండ్ పౌండ్లు 30, నేపాల్ కరెన్సీ 150 లభించినట్లు వెల్లడించారు.