హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన కోరుట్ల యువతి

JGL: కోరుట్ల యువతి కారపు శ్రీకృతి ఢిల్లీ వేదికగా ప్రతిభ చాటింది. శుక్రవారం న్యూఢిల్లీలోని వివాంతా బై తాజ్‌లో DK పేజెంట్స్ నిర్వహించిన మిస్ టీన్ ప్రైడ్ ఇండియా 2026 పోటీల్లో ఫేస్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆత్మవిశ్వాసం, నడక, వాక్చాతుర్యంతో జడ్జీలను ఆకట్టుకుంది. తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన శ్రీకృతికి అభినందనలు తెలిపారు.