హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన డిప్యూటీ DMHO

JGL: కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రసూతి వార్డును సందర్శించి గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రతను పరిశీలించారు. సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని, తల్లీబిడ్డల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు.