హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు రోజులు నీటి సరఫరా బంద్

ADB: మావల ఎక్స్ రోడ్ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. ఆదిలాబాద్ రూరల్, మావల, సాత్నాల, తాంసి, తలమడుగు, భీంపూర్, జైనథ్, బేల, బోరజ్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.