హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్పొరేట్ విద్యాసంస్థలపై విచారణ జరిపించాలి'

కరీంనగర్ జిల్లాలోని కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఐటీ శాఖలతో లోతైన విచారణ జరిపించాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి అధిక ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి కళాశాల ఆదాయం, ఆడిట్ నివేదికలు, యాజమాన్య ఆస్తులపై తనిఖీలు చేపట్టాలన్నారు.