NRML: రైతుల భూ సమస్యలను పరిష్కరించి అర్హులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. తానూర్ మండలంలోని మొగ్లి, ఎల్వీ, ఝరి-బి,, ఝరి తండా గ్రామసభల్లో భూ సమస్యలపై సమీక్షించారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి, రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
తెలంగాణ
గ్రామసభల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్ సమీక్ష


