హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ జోరు!

MDCL: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉప్పల్, చెంగిచర్ల డిపోల్లో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి సత్తా చాటింది. ఉప్పల్ డిపోలో క్లాస్-3లో 369, క్లాస్-6లో 282 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందింది. చెంగిచర్లలోనూ వరుసగా 196, 112 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. మరోవైపు ఉప్పల్ జోనల్ వర్క్‌షాప్‌లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ ఆధిపత్యం ప్రదర్శించింది.