హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్ PACS ఛైర్మన్‌గా భాస్కర్ రెడ్డి నియామకం

MDK: ఉమ్మడి తూప్రాన్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌గా ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. భాస్కర్ రెడ్డితో పాటు 12 మంది సభ్యులను నియమిస్తూ జీవో జారీ చేశారు. పెండింగ్ బకాయిలు వసూలు చేసేందుకు ఆరు నెలల కాలానికి నియామకం చేశారు.