హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించిన కలెక్టర్

KNR: కొత్తపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని శుక్రవారం రాత్రి కలెక్టర్ చిత్రమిశ్రా అధికారులతో కలిసి సందర్శించారు. వైద్య విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని తరగతి గదులు, గ్రంథాలయంతో పాటు ఇతర సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.