GDWL: అలంపూర్ మండలం నుంచి నందికొట్కూరుకి వెళ్లేదారిలో ర్యాలంపాడు బ్రిడ్జి దగ్గర రహదారికి ఇరువైపులా ముళ్ళ చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో భారీ వాహనాలు ఎదురుగా వచ్చే సమయంలో ముళ్ళ చెట్లు కళ్ళకు, శరీరానికి తగులుతున్నాయి. పాలక యంత్రాంగం స్పందించి వాహనదారుల భద్రత దృష్ట్యా రోడ్డు వైపుకు వాలిన ముళ్ళ చెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'ముళ్ళ చెట్లను తొలగించండి'


