WNP: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, భూగర్భ జలాల స్థితిగతులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు విస్తృతంగా చేపట్టి కూలీలకు పని కల్పించాలని, నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
తెలంగాణ
వర్షాభావంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్


