హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తిలో INTUC కూటమి ఘన విజయం

WNP: ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో వనపర్తి డిపోలో ఐఎన్‌టీయూసీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 389 మంది ఓటర్లకు గాను 388 మంది ఓటు వేశారు. రాష్ట్ర గుర్తింపులో 132, రీజియన్ గుర్తింపులో 148 ఓట్ల మెజారిటీ సాధించింది. విజయం పట్ల కార్మికులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. యూనియన్ నాయకులు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.