హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్లో అస్వస్థతకు గురై విదేశీయుడి మృతి

WGL: కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న స్కాట్లాండ్‌కు చెందిన మెకన్జీ కాలిన్ అయాన్ (69) అస్వస్థతకు గురై మృతి చెందారు. ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో శుక్రవారం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటనపై జీఆర్పీ సీఐ సురేష్ వివరాలు సేకరించి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.