హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి ఉత్తమ్‌ను కలిసిన నేరేడుచర్ల మార్కెట్ కమిటీ

SRPT: నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది. కమిటీ సభ్యులను కాంగ్రెస్ నాయకులు మంత్రికి పరిచయం చేశారు. రైతులకు మెరుగైన సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచిస్తూ.. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.