హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కాంతులతో ముస్తాబైన మహాశక్తి ఆలయం

KNR: కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయం దసరా నవరాత్రుల సందర్భంగా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఆలయానికి వెళ్లే రహదారులను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక ఉత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి. భవానీ మాలధారణలు,పూజలు, సంప్రదాయ దాండియాతో భక్తి,సేవలతో నవరాత్రులు జరగనున్నాయి.