హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 10 నుంచి 22వ తేదీ దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. సెలవుల్లో ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 23వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యాలు గమనించాలని తెలిపారు.