హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దు'

JGL: మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించాలని కొడిమ్యాల ఎస్సై నరేష్ అన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో సూరంపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అశాస్త్రీయ నమ్మకాలకు దూరంగా ఉండాలి, ఏదైనా సమస్య ఉంటే వెంటనే 112 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.