హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో గంజాయి పట్టివేత.. యువకుడికి రిమాండ్

SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం 540 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆల్వాలపురానికి చెందిన మద్దే రవితేజ (22)ను అరెస్టు చేశారు. గంజాయి, మొబైల్ ఫోన్ కలిపి రూ.22,500 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.