VSP: కంచరపాలెంలో జ్యోతినగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఈనెల 11న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో వాసన్ ఐకేర్ వైద్యులు పాల్గొని రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు శిబిరం జరుగుతుందని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


