హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగిరెడ్డిపేటలో చిరుత సంచారం..!

KMR: నాగిరెడ్డిపేట మండలం మాసానిపల్లిలో చిరుత సంచరించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. అటవీశాఖ అధికారులు స్పందించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పరిసరాల్లో చిరుత సంచరించినట్లు తెలియడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.