హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: RTC ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం

GDWL: గద్వాల ఆర్టీసీ డిపోలో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (EU) భారీ మెజారిటీతో విజయం సాధించడంతో నాయకులు, కాంగ్రెస్, సీపీఐ నేతలు సంబరాలు జరుపుకున్నారు. డిపోలో మొత్తం 371 ఓట్లకు గాను 363 ఓట్లు పోల్ కాగా, ఈయూ 239 ఓట్లు సాధించి విజయకేతనం ఎగరేయగా, ప్రత్యర్థి TWUకు 114 ఓట్లే దక్కాయి.