హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంతర్వేదిలో దసరా ఉత్సవాలు రద్దు'

కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ ఏడాది "దసరా ఉత్సవాలు" రద్దు చేసినట్లు ఆలయ ఈవో MKT నాగ వరప్రసాద్ తెలిపారు. గోదావరి పుష్కర నిధులతో శ్రీఅమ్మవారి ఆలయ పునఃనిర్మాణ పనులు చేపట్టడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీన స్వామి వారి ఆలయంలో ఆలయ శంకుస్థాపన పనులు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు.