SRCL: ఇల్లంతకుంట మండలంలోని ఏడు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ నగేష్ తెలిపారు. 132 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని 33 కేవీ ఫీడర్ల మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇల్లంతకుంట, రహీంఖణపేట, చీర్లవంచ, కందికట్కూరు, గాలిపల్లి, పెద్దలింగాపూర్, అనంతగిరి గ్రామాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఏడు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం


