హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మశానవాటిక అభివృద్ధికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ కు వినతి

KMR: కామారెడ్డి పట్టణంలో అన్ని వసతులతో కూడిన స్మశానవాటిక అభివృద్ధికి ఎస్.ఆర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఫౌండేషన్ సభ్యులు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణికి డీపీఆర్ కోసం వినతిపత్రం అందజేశారు. అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా, పరిశుభ్రంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలతో ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు.