హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైళ్లలో మొబైల్స్ చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

WGL: ఖమ్మం, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య రైళ్లు, స్టేషన్లలో మొబైల్స్ దొంగతనం చేస్తున్న ఖమ్మం జిల్లా కాటన్ మార్కెట్ రోడ్డుకు చెందిన నూనే ఇంద్రకాంతు‌ను వరంగల్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ సీఐ నరేష్ కుమార్ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.80 వేల విలువైన 4 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు స్టేషన్లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.