కాకినాడ: రాజమహేంద్రవరం తిరుమల కళాశాల విద్యార్థి పఠాన్ సమీర్ ఖాన్ రాష్ట్రస్థాయి వుషు పోటీల్లో అదరగొట్టాడు. నెల్లూరులో జరిగిన పోటీల్లో 56 కిలోల విభాగంలో సమీర్ గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సమీర్ ప్రతిభను గుర్తించిన తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ యు.శ్రీహరి అతనికి రూ.10 వేలు అందించి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వుషు పోటీల్లో తిరుమల విద్యార్థికి స్వర్ణం


