హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానసిక ఆరోగ్యంతోనే సంతోషకర జీవితం: జడ్జి వైష్ణవి

BHPL: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం భూపాలపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. మానసిక ఆరోగ్యం సరిగా ఉంటే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జీవితం సంతోషంగా ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి సూచించారు.