హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి: కలెక్టర్

ADB: వార్తలు ప్రచురించే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో జరిగిన జర్నలిస్టుల శిక్షణలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెరిగిందని, ఏఐపై అవగాహన పెంచుకోవాలన్నారు. అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. వేగం కంటే విశ్వసనీయత ముఖ్యం అని పేర్కొన్నారు.