హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నల్లా కనెక్షన్ల దందా.. రూ.10 వేల వరకు వసూలు

WGL: వరంగల్, హనుమకొండ నగరాల్లో అక్రమ కుళాయి కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. లైన్‌మెన్లు, ఒప్పంద ఉద్యోగులు రూ.5-10 వేల వరకు తీసుకొని అనధికార కనెక్షన్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గ్రేటర్‌ వరంగల్‌ బల్దియాకు రోడ్డు కటింగ్‌ ఛార్జీలు, నీటి పన్ను రూపంలో ఆదాయం గండిపడుతోంది. అక్రమ కుళాయి కనెక్షన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బల్దియా కమిషనర్‌ వెంకన్న ఆదేశాలు జారీ చేసారు.