MHBD: పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.8,667గా నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో నమోదు చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
తెలంగాణ
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి


