SRD: కల్హేర్ మండలంలో కృష్ణాపూర్ రైతులు నేడు స్వయంగా రంగంలోకి దిగారు. కాలువల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఏడు మోటార్లు, అడ్డుకట్టలను తొలగించి ఇరిగేషన్ సిబ్బందికి అప్పగించారు. అక్రమ మోటార్ల వల్ల కృష్ణాపూర్, ఇందిరానగర్, మార్డి, కల్హేర్ గ్రామాలకు నీరు అందడం లేదని రైతులు తెలిపారు. చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లు ఇవ్వాలని అధికారులను కోరారు.
తెలంగాణ
నల్లవాగు ఆయకట్టుకు సాగునీరు: అక్రమ మోటార్ల తొలగింపు


