హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు

ADB: ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ టి. ప్రతాప్ సింగ్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో హిందీ భాష ప్రాముఖ్యతను వివరించారు. 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికారిక భాషగా ఆమోదించినట్లు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడుతూ, అన్ని భాషలను గౌరవిస్తూ హిందీని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.