హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరంతరాయంగా కరెంట్ ఇవ్వాలి'

MDK: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరిగా లేక వరి పంటలు ఎండిపోతున్నాయని నిరసిస్తూ రెడ్డిపల్లి వద్ద నర్సాపూర్-మెదక్ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను కాపాడాలని, ఇచ్చిన హామీ ప్రకారం నిరంతరాయంగా కరెంట్ అందించాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామన్నారు.